
ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు ఈరోజు సెలవు దొరికింది.
ఆదిపురుష్ ట్రైలర్ ఇంతకుముందే రిలీజైంది. భారత ఇతిహాసమైన రామాయణం, వెండితెర మీద ఎంత అద్భుతంగా కనబడనుందో ట్రైలర్ చెప్పేసింది.
రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. ఇలా అందరూ ట్రైలర్ లో చక్కగా కనిపించారు.
కళ్ళు జిగేలుమనే విజువల్స్, ఒళ్ళు పులకరించే నేపథ్య సంగీతం.. అన్నీ తోడై ఆదిపురుష్ ట్రైలర్ ను ఆసక్తిగా మార్చేసాయి.
టీజర్ కంటే ట్రైలర్ వెయ్యిరెట్లు మెరుగ్గా ఉన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Details
విజువల్ వండర్ గా ఉండనున్న రామసేతు నిర్మాణం సీన్
ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం, కథంతా హనుమంతుడు చెబుతున్నట్లుగా ఉంది. ట్రైలర్ మొదటి షాట్ లో హనుమంతుడిని చూపించారు కూడా.
సంజీవని కోసం హనుమంతుడు పర్వతాన్ని మోసుకొచ్చే దృశ్యం థియేటర్లో అత్యద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.
రామసేతు నిర్మాణం, లంకాదహనం మొదలగు సీన్లు విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.అయితే ఈ ట్రైలర్ లో రావణుడి పాత్ర సీన్లు రెండు మాత్రమే ఉన్నాయి.
టీ సిరీస్, రెట్రో ఫైల్స్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఓంరౌత్ తెరకెక్కించారు. జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్
Hari Anant, Hari Katha Ananta 🙏🏻
— Om Raut (@omraut) May 9, 2023
Jai Shri Ram
जय श्री राम
జై శ్రీరాం
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം#AdipurushTrailer out now!https://t.co/hax5G3AXlO#Adipurush in cinemas worldwide on 16th June.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar pic.twitter.com/XYzpFBbxND