ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపించిన ఆదిపురుష్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్ షొస్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది. త్రీడీ వెర్షన్ లో ఓం రౌత్ అందించిన రామాయణంపై ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం. ఆదిపురుష్ ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ వేరే లెవెల్లో ఉన్నాయని అంటున్నారు. తొలిసగం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని ప్రతీ ఒక్కరు చెబుతున్నారు. ముఖ్యంగా పాటలు బాగున్నాయనీ, నేపథ్యసంగీతం అదిరిందనీ కామెంట్లు పెడుతున్నారు. హనుమంతుడి ఎంట్రీ సమయంలో వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుందని రివ్యూలు రాస్తున్నారు. సీతను రావణుడు ఎత్తుకెళ్ళే సీన్ ని బాగా చూపించారని అంటున్నారు.
నెమ్మదించిన సెకండాఫ్
రావణుడి లంకను చూపించిన విధానం బాగుందని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ మాత్రం కొద్దిగా నెమ్మదించిందని, ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ కు తక్కువ మార్కులు పడతాయని చెప్పుకొస్తున్నారు. రాముడిగా ప్రభాస్ బాగున్నాడనీ, సీతగా క్రితిసనన్ ఆకట్టుకుందనీ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. పిల్లలకు తప్పకుండా త్రీడీలో ఈ సినిమా చూపించాలని సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా 7వేల స్క్రీన్లలో రిలీజైన ఆదిపురుష్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా అమ్ముడయ్యాయి. మొదటిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.