ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
ఆదిపురుష్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, సినిమా విడుదల ఆలస్యంపై, గ్రాఫిక్స్ పనులపై మాట్లాడారు. ఆదిపురుష్ చిత్ర టీజర్ కు వచ్చిన స్పందనను పరిశీలించామని, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాకు మెరుగులు దిద్దామని ఆయన అన్నారు.
సినిమా ఔట్ పుట్ బాగా రావడానికి మరింత శ్రమించామని, అందుకే విడుదల ఆలస్యం అవుతుందని అన్నారు.
ఆదిపురుష్ కోసం చాలా కష్టపడ్డామని, ప్రస్తుతం ఔట్ పుట్ పట్ల సంతృప్తిగా ఉన్నామని, సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు.
ఇక దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, ఆదిపురుష్ కోసం హాలీవుడ్ సినిమాల్లో వాడే టెక్నాలజీని వాడామని చెప్పుకొచ్చారు. అవతార్, మార్వెల్, డీసీ చిత్రాల్లో ఉండే టెక్నాలజీని ఆదిపురుష్ లో వాడామని అన్నారు.
Details
ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదు
ఆదిపురుష్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ఇండియాలో ఇదివరకెప్పుడూ ఇలాంటి చిత్రం రాలేదని దర్శకుడు ఓం రౌత్ అన్నారు.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్ర ప్రమోషన్ పనులు నెమ్మదిగా మొదలవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక పాటను రిలీజ్ చేసారు. ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
అలాగే అమెరికాకు చెందిన ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో జూన్ 13వ తేదీన ఆదిపురుష్ చిత్రం ప్రదర్శితం అవుతుందని ఓం రౌత్ తెలియజేసాడు.
టీ సిరీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో, సీత పాత్రలో క్రితిసనన్ కనిపిస్తోంది. రావణాసురుడుగా సైఫ్ ఆలీ ఖాన్ మెరుస్తున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.