NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాలయ్య అఖండ హిందీలో విడుదల
    తదుపరి వార్తా కథనం
    బాలయ్య అఖండ హిందీలో విడుదల
    అఖండ హిందీ ట్రైలర్ విడుదల చేసిన పెన్ స్టూడియో

    బాలయ్య అఖండ హిందీలో విడుదల

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 05, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా వల్ల థియేటర్లలోకి రావడానికి జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో రిలీజై, వసూళ్ళలో తుఫాను సృష్టించింది.

    బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి తిరుగులేదని అఖండ సినిమాతో మరోమారు నిరూపితమైంది. ఈ సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వల్ల అమెరికాలోని థియేటర్లలో సౌండ్ బాక్సులు పగిలిపోయాయని వార్తల్లో వచ్చాయి.

    సినిమా ఒక ఎత్తైతే, నేపథ్య సంగీతం మరో ఎత్తుగా ఉన్న ఈ సినిమా, బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించింది. అటు కరోనా వల్ల థియేటర్లకు జనం రారేమో అన్న అనుమానాన్ని పటాపంచలు చేసి, సినిమా ఇండస్ట్రీకి ధైర్యాన్నిచ్చింది.

    ప్రస్తుతం అఖండ సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    అఖండ సినిమా

    అఖండ హిందీ ట్రైలర్ విడుదల

    తెలుగులో విజయ ఢంకా మోగించిన అఖండ, హిందీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అఖండ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

    ఈ మేరకు హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి, జనవరి 20వ తేదీన థియేటర్లలోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది పెన్ స్టూడియో.

    ఇక్కడ అఖండ హిందీ వెర్షన్ కి బోయపాటి ఒక మంచి అడ్వాంటేజ్ గా మారబోతున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ సరైనోడు సినిమా హిందీ వెర్షన్ ను వందల మిలియన్ల మంది చూసారు.

    సరైనోడు డైరెక్టర్ నుండి వచ్చిన సినిమా అని ప్రచారం చేస్తే హిందీలో అఖండకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బాలయ్య అఖండ హిందీ ట్రైలర్ విడుదల

    #Akhanda #AkhandaHindi pic.twitter.com/LfqsBoNCed

    — Aakashavaani (@TheAakashavaani) January 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025