Akkineni Akhil - Zainab Ravdjee: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్, ప్లేస్ ఖరారు..? అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేడుక!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ గతేడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, వీరి పెళ్లి త్వరలోనే జరగనుంది.
డిసెంబర్ 2024లో అఖిల్ అన్న నాగచైతన్య, శోభితని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి వేడుక జరగనుంది.
అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీ పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఇరుకుటుంబాల సమక్షంలో జరగనుంది.
మార్చ్ 24, 2025 న వీరి పెళ్లి జరగనుందని సమాచారం. నాగచైతన్య - శోభిత పెళ్లి కూడా అదే స్థలంలో జరిగింది, కాబట్టి అఖిల్ పెళ్లి కూడా అక్కడే జరగనుందని తెలుస్తుంది.
Details
జైనబ్ రవ్జీ తండ్రి ప్రముఖ బిజినెస్ మెన్
జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, పెయింట్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది.
అదేవిధంగా ఆమెకు బ్యూటీ కేర్ వ్యాపారం కూడా ఉంది. జైనబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ, ప్రముఖ బిజినెస్ మెన్ కాగా, ఆయనకు ఇండియా, లండన్, దుబాయ్ తదితర దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి.
జుల్ఫీ రవ్జీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సన్నిహితుడు, అంతేకాకుండా నాగార్జునకు కూడా వ్యాపార సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అఖిల్ ప్రస్తుతం 'ఏజెంట్' సినిమాతో వరుస ఫ్లాప్స్ తర్వాత ఒక కొత్త సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా, యువీ క్రియేషన్స్‌లో మరో ప్రాజెక్ట్ కూడా మొదలైందని సమాచారం.