Page Loader
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త
అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ కేసును తాను ఉపసంహరించుకుంటానని, అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌కు ఎటువంటి సంబంధం లేదని భాస్కర్ స్పష్టం చేశారు. భాస్కర్ ఓ వీడియోలో మాట్లాడుతూ, "నా కుమారుడు 'పుష్ప 2' సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లా. ఇందులో అల్లు అర్జున్‌కు తప్పు ఏమీ లేదు. నాకు పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయాలని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ, ఫోన్‌లో అరెస్టు వార్త చూసాను. ఇప్పుడు ఈ కేసును ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న మృతురాలు రేవతి భర్త