LOADING...
Allu Arjun: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Allu Arjun: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న తరువాత బెయిల్ ఇచ్చిన కోర్టు. జైలు సూపరిండెంట్ కి బాండ్లు సమర్పించాలన్న కోర్టు. అర్నబ్ గోస్వామి కేసు ఆధారంగా బెయిల్ మంజూరు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో మధ్యాహ్నం 1.30కి పేర్కొన్నారు. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను తక్షణం చేపట్టడమే అవసరంలేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు.

వివరాలు 

క్వాష్‌ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని వాదనలు

అల్లు అర్జున్ అరెస్టు అయినందున, ఆయనకు బెయిల్‌ అవసరమైతే మరో పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించారు. అయితే, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి, క్వాష్‌ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని వాదనలు వినిపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ కి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు