LOADING...
Allu Arjun: లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా... అధికారిక ప్రకటన వచ్చేసింది!

Allu Arjun: లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా... అధికారిక ప్రకటన వచ్చేసింది!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో ఓ భారీ సినిమా అధికారికంగా ఫిక్స్ అయ్యింది. కొంతకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు బుధవారం భోగి పండుగ సందర్భంగా అధికారికంగా వెల్లడించారు. AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించిన ప్రత్యేక వీడియో ద్వారా ఈప్రకటన వెలువడటంతో అభిమానుల్లో హడావుడి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో ఓసైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.

వివరాలు 

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది  

AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బన్నీ కొంత విరామం తీసుకుని లోకేశ్ కనగరాజ్ సినిమా పనులు ప్రారంభించనున్నారని సమాచారం. గతంలో లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్‌కు కథ వినిపించడంతోనే ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. అయితే లోకేశ్ తన సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా'ఖైదీ 2'తెరకెక్కిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజా ప్రకటనతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 'పుష్ప' సిరీస్‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమవుతోంది.

Advertisement