
అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
అయితే సడెన్ గా అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. ఆ పోస్టర్ పుష్ప 2 సినిమాకు సంబంధించినది అనుకుంటే మన పొరపాటే అవుతుంది.
కభీ అప్నే కభీ సప్నే అనే టైటిల్ తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతోందని ఒకానొక పోస్టర్ బయటకు వచ్చింది.
అల్లు అర్జున్, క్రిష్ కాంబినేషన్ గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు రాలేదు. సడన్గా పోస్టర్ ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అవుతున్నారు.
మరి ప్రస్తుతం విడుదలైన పోస్టర్ నిజంగా నిజమేనా లేదా అనేది అల్లు అర్జున్ లేదా క్రిష్ స్పందిస్తేనే అర్థమవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు అర్జున్ కొత్త పోస్టర్ పై ట్వీట్
We were all waiting for #Pushpa2 but what is this surprise? Is this real? Is @alluarjun & @DirKrish combo on cards? Leaked?#KabhiApneKabhiSapne pic.twitter.com/jPvDN7Kl5D
— Ramesh Bala (@rameshlaus) September 28, 2023