
Allu Sirish: నయనికతో అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్.. తేదీ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ రోజు తన తాత, అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో 31 అక్టోబర్ నయానికతో ఎంగేజ్మెంట్ చేసుకుంటానని శిరీష్ వెల్లడించారు. ఆయన ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తనకు పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఉండేవన్నారు. నాన్నమ్మ లేకపోయినా పైనుంచి తనపై ఆశీర్వాదాలు కురిపిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
అల్లు శిరిష్ పెళ్లి చేసుకోవబోయే నయానిక హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి కుమార్తెగా తెలిసింది. కానీ మరింత వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. సినీ కెరీర్ గురించి చెప్పుకుంటే, అల్లు శిరీష్ చివరగా 'బండి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పటివరకు ఆయన మరే ఇతర తెలుగు సినిమాను అనౌన్స్ చేయలేదు. ఎక్కువగా ముంబైలో ఉండి హిందీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగింది. ఈ విషయంపై అల్లు శిరీష్ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.