
Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఖరారు !
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. నగరంలో ఎన్ని మల్టీప్లెక్స్ వచ్చినా కూడా, సినిమా ప్రేమికులు తమ ఇష్టమైన హీరోల చిత్రాలు చూడాలనుకుంటే, ఎక్కువగా ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లను ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ప్రసిద్ధి పొందిన ఓడియన్,మినీ ఓడియన్ థియేటర్లు కొన్ని సంవత్సరాల క్రితం మూతపడగా, ఆ రెండు థియేటర్ లను పూర్తిగా మల్టీప్లెక్స్ రీతిలో మార్పు చేశారు.
వివరాలు
కొత్త రూపంలో ఓడియన్ థియేటర్
సూపర్‌స్టార్ మహేష్ బాబు థియేటర్ వ్యాపారంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. AMB సినిమాస్ ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్ లాంటి పెద్ద థియేటర్ లతో పోటీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యంతో ఓడియన్ థియేటర్లు కొత్త రూపంలో "AMB క్లాసిక్ మల్టీప్లెక్స్"గా మారతాయి. ఈ కొత్త మల్టీప్లెక్స్ 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ ప్రారంభోత్సవం జరుపనుంది.
వివరాలు
పెద్ద స్క్రీన్ మీద సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవకాశం
ఈ మల్టీప్లెక్స్‌లో 7 విలాసవంతమైన స్క్రీన్లు ఉండవు, ప్రతి సినిమా ప్రేక్షకులకు మరింత ప్రత్యేక అనుభవం ఇవ్వడానికి ప్రతి సీటింగ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ల వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి, ప్రతి సినిమా థ్రిల్లింగ్ అనుభూతిగా మారుస్తుంది. వీటితో అభిమానులు పెద్ద స్క్రీన్ మీద సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవకాశం పొందుతారు. AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ప్రారంభం కోసం అభిమానుల్లో ఉత్సాహం చెలరేగింది. ఫ్యాన్స్ ఈ గ్రాండ్ ప్రారంభోత్సవాన్ని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.