డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ
హాంకాంగ్ లో జన్మించిన ప్రఖ్యాత అమెరికన్ సింగర్ కోకోలీ 48ఏళ్ళ వయసులో కన్నుమూసింది. ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసేసుకుంది కోకోలీ. కోకోలీ మరణించిన విషయాన్ని వెల్లడి చేసిన ఆమె సిస్టర్స్ కారోల్, నాన్సీ లీ.. ఇన్స్ టా గ్రామ్ వేదికగా ఆత్మహత్యకు కారణమేంటో తెలియజేసారు. గతకొన్ని రోజులుగా కోకోలో డిప్రెషన్ తో బాధపడుతుందట. దాన్నుండి బయటకు రావాలని ఆమె ఎంతగానో ప్రయత్నించిందనీ, చివరికి తనవల్ల కాలేక జులై 2వ తేదీన ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని సిస్టర్స్ తెలియజేసారు. రెండు రోజుల పాటు చావుతో పోరాడిన కోకోలీ, చివరకు జులై 5వ తేదీన హాంకాంగ్ లో తుదిశ్వాస విడిచిందని సిస్టర్స్ చెప్పుకొచ్చారు.
కోకోలీ పాడిన పాటకు ఆస్కార్ నామినేషన్
18ఏళ్లకే సింగర్ గా మారిన కోకోలీ 30ఏళ్ల పాటు అనేక పాటలు పాడింది. ఆమె పాడిన వాటిలో క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ సినిమాలోని ఏ లవ్ బిఫోర్ టైమ్ అనే పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఆస్కార్ వేదికపై కోకోలీ పర్ ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. 1975లో హాంకాంగ్ లో జన్మించిన కోకోలీ, 1992లో హై స్కూల్ పాసవగానే సింగింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1996లో సోనీ మ్యూజిక్ ఎంటర్ టైన్మెంట్స్ కంపెనీతో ఒప్పందం కుదురుచుకుని ఒక ఆల్బమ్ ని రిలీజ్ చేసింది. ఆ తరువాత అటు అమెరికాలో ఆమెకు అవకాశాలు బాగా వచ్చాయి. 2011లో బ్రూస్ రోకోవిట్జ్ అనే వ్యక్తిని కోకోలీ పెళ్ళి చేసుకుంది.