Amitabh Bachchan: అయోధ్యలో ప్లాట్‌ను కొనుగోలు చేసిన అమితాబ్.. ఎన్నికోట్లో తెలుసా?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో రూ.14.5 కోట్లతో 10 వేల చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అయోధ్యలోని సరయూ నదికి సమీపంలో గల సెవెన్ స్టార్ ఎన్‌క్లేవ్‌లో అమితాబ్ ఒక ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది. దీని నిర్మాణ పనులను ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధాకు అమితాబ్ అప్పగించారు. ఈ ఫ్లాట్ శ్రీరామ జన్మభూమి ఆలయానికి 15 నిమిషాల దూరంలో ఉండటం విశేషం. ఈ ప్లాట్ జాతీయ రహదారి 330లో అమితాబ్ బచ్చన్ పూర్వీకుల ఇంటి నుంచి నాలుగు గంటల దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉంటుంది.