Loading...
Amitabh Bachchan: కేబీసీ షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. మోకాలికి గాయం, అభిమానుల్లో ఆందోళన
కేబీసీ షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. మోకాలికి గాయం, అభిమానుల్లో ఆందోళన

Amitabh Bachchan: కేబీసీ షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. మోకాలికి గాయం, అభిమానుల్లో ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (Kaun Banega Crorepati) షూటింగ్‌ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 18వ సీజన్‌ ప్రసారమవుతోంది. షూటింగ్‌ సమయంలో తాను ప్రమాదవశాత్తూ జారిపడ్డానని అమితాబ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ కారణంగా ఆయన మోకాలికి గాయం కావడంతో కొంత ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు. సాధారణంగా కేబీసీ ప్రారంభమైనప్పుడు అమితాబ్‌ స్టేజ్‌ మధ్యలో నిలబడి పోటీదారులను ఆహ్వానిస్తుంటారు. అయితే తాజా ఎపిసోడ్‌లో మాత్రం ఆయన కూర్చొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోకాలికి గాయం కావడంతో ఎక్కువసేపు నిలబడటం కాస్త ఇబ్బందిగా ఉందని ప్రేక్షకులకు వివరించారు.

వివరాలు 

అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: అమితాబ్

అయితే తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్‌ స్పష్టం చేశారు.

కంటెస్టెంట్‌లను స్వాగతించేందుకు తన సీటు వద్దే నిలబడతానని చెప్పారు.

కానీ ప్రారంభ ప్రసంగం సమయంలో వారి వద్దకు వెళ్లి నిలబడటం మాత్రం కొంత కష్టంగా ఉందని వివరించారు.

అమితాబ్‌ గాయపడిన విషయం తెలియడంతో ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు.

వివరాలు 

బిగ్‌బీ త్వరగా కోలుకోవాలని పోస్టులు

బిగ్‌బీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.

83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌ వరుసగా సినిమాలు, టెలివిజన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇటీవల 'సెక్షన్‌ 84' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమితాబ్‌.. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి' సీక్వెల్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్‌లోనూ ఆయన పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ADVERTISEMENT