LOADING...
Amy Jackson: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ నటి.. కొడుకుకు ఏమి పేరు పెట్టిందంటే 
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ నటి.. కొడుకుకు ఏమి పేరు పెట్టిందంటే

Amy Jackson: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ నటి.. కొడుకుకు ఏమి పేరు పెట్టిందంటే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) మరోసారి తల్లైంది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన కుమారుడికి ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్‌ (Oscar Alexander Westwick) అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ సందర్భంగా భర్త, బిడ్డతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు అమీ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాలు 

 'ఎవడు' చిత్రంలో  రామ్ చరణ్ సరసన..

అమీ జాక్సన్ సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా గుర్తింపు సాధించింది. 2010లో తమిళ సినిమా 'మద్రాస్ పట్టణం' ద్వారా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది. అనంతరం బాలీవుడ్‌లో ప్రతీక్ బబ్బర్ సరసన 'ఏక్ దివానా థా' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2014లో తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రంలో నటించింది. 2018లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో 2.O' సినిమాలో నటించి మరింత గుర్తింపు పొందింది. అలాగే చియాన్ విక్రమ్ 'ఐ' సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అమీ జాక్సన్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.

వివరాలు 

హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ తో  వివాహం 

గతేడాది ఆగస్టులో తన ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ (Ed Westwick)ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి దక్షిణ ఇటలీలోని 16వ శతాబ్దానికి చెందిన కాస్టెల్లో రోకో కోటలో జరిగింది. అంతకు ముందు, అమీ జాక్సన్ బిజినెస్‌మెన్ జార్జ్ పనయోట్టు తో ప్రేమలో ఉండి, 2019లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అయితే పెళ్లి కాకముందే వీరి మధ్య విభేదాలు ఏర్పడటంతో, చివరకు 2022లో వారి సంబంధాన్ని ముగించుకుంది. ఈ క్రమంలో తన కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత అమీ జాక్సన్ హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను ప్రేమలో పడి, వివాహం చేసుకుంది.