
Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ భారీ మోసానికి గురయ్యాడు.
ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవులను ఇప్పిస్తామని చెప్పి కొందరు కేటుగాళ్లు ఆయన నుంచి రూ.25 లక్షలు దోచుకున్నారు. దీంతో జగదీశ్ పటానీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
జగదీశ్ పటానీకి బరేలీకి చెందిన దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులు, తమకు రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్నాయని చెప్పి పరిచయమయ్యారు.
ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ కమిషన్‌లో ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ వంటి పదవులు ఇప్పిస్తామని ఆయన్ను నమ్మించారు.
Details
నిందితుల కోసం గాలింపు
దీంతో జగదీశ్ పటానీ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. వారం గడిచినా పదవులు లభించకపోవడంతో, జగదీశ్ వారిని డబ్బు అడిగారు.
అయితే వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జగదీశ్ పటానీ పోలీసుల సాయం తీసుకున్నారు.
ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.