Loading...
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీకి చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్‌.. వెంకీ మామతో షూటింగ్‌ షురూ!
సైలెంట్‌గా ఊటీకి చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్‌.. వెంకీ మామతో షూటింగ్‌ షురూ!

January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీకి చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్‌.. వెంకీ మామతో షూటింగ్‌ షురూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం 'జనవరి 12 విడుదల' షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ తదుపరి షెడ్యూల్‌ తాజాగా ఊటీలో ప్రారంభమైంది. గత నెలలో మైసూర్‌లో కీలక సన్నివేశాలతోపాటు ఓ కలర్‌ఫుల్‌ పాటను చిత్రీకరించిన చిత్ర బృందం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఊటీ కొండల్లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ''నా అద్భుతమైన టీమ్‌తో అందమైన ఊటీ షెడ్యూల్‌ ప్రారంభమైందంటూ షూటింగ్‌ అప్‌డేట్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ మల్టీస్టారర్‌ 2027 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.

వివరాలు

వెంకీ మామా లుక్‌ అదుర్స్‌!

ఈ సినిమాలో వెంకటేశ్‌ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌ ఇప్పటికే సినీ అభిమానులను ఆకట్టుకుంది.

ఆర్మీ యూనిఫామ్‌, కళ్లజోడు, మెడలో స్కార్ఫ్‌తో 'లెఫ్టినెంట్‌ కల్నల్‌ వెంకట్‌ రెడ్డి'గా వెంకటేశ్‌ కనిపించిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

సాధారణంగా అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీలో వెంకటేశ్‌ కనిపిస్తే థియేటర్లలో నవ్వులు పూస్తాయి. అలాంటిది ఈసారి మిలిటరీ నేపథ్యంలో వెంకీ సీరియస్‌ లుక్‌లో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది.

దీనికి కళ్యాణ్‌ రామ్‌ ఎనర్జీ కూడా తోడైతే తెరపై సందడి ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT