Animal : యానిమల్'కు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ రొమాంటిక్ సీన్లన్నీ గల్లంతేనట
ఈ వార్తాకథనం ఏంటి
యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ మేరకు 5 సీన్స్‌ను బోర్డు కట్ చేసిందంటూ ఓ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన 'యానిమల్' సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది.
రణ్ బీర్ కపూర్,రష్మికలు విజయ్, జోయా పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో విజయ్, జోయా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌ను తగ్గించమని సందీప్‌కూ సూచనలు అందాయట.
రొమాంటిక్ సీన్స్‌లోని క్లోజప్ షాట్స్‌ను డిలీట్ చేసి, విజయ్, జోయా మధ్య సీన్స్‌లో మార్పులు చేసినట్లు సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.
సెన్సార్ సర్టిఫికెట్ మేరకు సినిమాలో 'వస్త్రా' అనే హిందీ పదాన్ని తొలగించి కాస్ట్యూమ్ అనే ఇంగ్లీష్ పదాన్ని చేర్చడం గమనార్హం.
details
నా కొడుకుకే సినిమా చూపించను : సందీప్ వంగా
'యానిమల్'కు ఏ సర్టిఫికెట్ రావడంపై దర్శకుడు సందీప్ వంగా ఇప్పటికే తన అభిప్రాయాలను వెల్లడించాడు.
సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం కరెక్టేనని, కేవలం పెద్దవాళ్ల కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించానన్నారు. ఈ విషయంలో యానిమల్ సినిమాను తన కొడుకుకు కూడా చూపించేది లేదన్నారు.
'యానిమల్' సినిమా నిడివి 3 గంటల 23 నిమిషాలు ఉంది. తొలుత ఈ మూవీ ఫైనల్ కట్ 3 గంటల 45 నిమిషాలు వచ్చిందని, దీంతో తానే 3 గంటల 21 నిమిషాలకు కుదించినట్లు దర్శకుడు సందీప్ వంగా చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా నిర్మాతకు లాభాలు ఇస్తాతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1న 'యానిమల్' థియేటర్లలో విడుదలకు రెఢీ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యానిమల్ సినిమా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రిపోర్ట్ ఇదే
#Animal CBFC Report.
— Vimal (@Kettavan_Freak) November 27, 2023
Run-time: 3hr 23min 29sec
Certified: A#AnimalCensorReport pic.twitter.com/C1Hq0Ei2uZ