NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? 
    తదుపరి వార్తా కథనం
    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? 
    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ

    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 21, 2023
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైతన్యా రావు, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన అన్నపూర్ణ స్టూడియో చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజైంది. ఓ పిట్టకథ ఫేమ్ చెందు మొద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

    కథ:

    గోదావరి జిల్లాల్లో కపిలేశ్వరపురం అనే గ్రామంలో చంటి (చైతన్యా రావు) అనే కుర్రాడు తన తల్లి అన్నపూర్ణ పేరు మీద ఫోటో స్టూడియో నడుపుతుంటాడు.

    వయసు మీద పడుతున్నా పెళ్ళి కుదరక ఇబ్బంది పడుతుంటాడు. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆమెతో పెళ్ళి ఐపోయినట్టు ఊహించేసుకుంటాడు.

    ఈ క్రమంలో ఒక ఫంక్షన్ లో గౌతమి(లావణ్య) కనిపిస్తుంది. అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయం, జ్యోతిష్యుడైన చంటి తండ్రికి తెలుస్తుంది.

    Details

    సినిమా ఎలా ఉందంటే? 

    చంటి ప్రేమ గురించి తెలుసుకున్న తండ్రి, గౌతమికి ఒక రహస్యాన్ని చెబుతాడు. అదే టైమ్ లో ఒక మర్డర్ కేసులో చంటి ఇరుక్కుంటాడు. అసలు చంటి తండ్రి చెప్పిన రహస్యమేంటి? మర్డర్ కేసు మిస్టరీ ఏంటనేదే కథ.

    80ల కాల నాటి అమాయకత్వాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఫస్టాఫ్ అంతా హాయిగా నవ్వుకుంటూ గడిచిపోతుంది. చంటికి ఇంకా పెళ్ళి కావట్లేదని ఫ్రెండ్స్ ఏడిపించడాలు, ఇంకా అమ్మాయి దొరకట్లేదని చంటి బాధపడటాలు అంతా సరదాగా గడిచిపోతుంది.

    ఎక్కడా బోర్ అనిపించకుండా స్మూత్ గా పోతూ ఉంటుంది. ఇక సెకండాఫ్ లో కథ మెయిన్ లైన్లోకి రావడం వల్ల కామెడీ తగ్గిపోయింది. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టు, ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది.

    Details

    ఎవరెలా చేసారంటే? 

    వయసు పైబడ్డ యువకుడిగా చైతన్యా రావు మెప్పించాడు. గౌతమి పాత్రలో లావణ్య, అచ్చం తెలుగమ్మాయిలా అందంగా ఉంది. వీరిద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

    ఈ సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్. 80ల కాలంలోకి తీసుకెళ్ళడంలో ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ ఎంతగానో సాయపడింది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంటుంది.

    నిర్మాణ విలువలు సూపర్బ్. నిర్మాణంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది.

    ఈ సినిమా టైమ్ పీరియడ్.. 80ల కాలం కాబట్టి కొన్ని సీన్లను కూడా 80ల కాలం నాటి ఫిలిమ్ మేకింగ్ స్టైల్ లో చూపించారు. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది.

    ఓవరాల్ గా చూస్తే, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్లి క్లీన్ సినిమాను ప్రశాంతంగా చూసి రావొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మూవీ రివ్యూ
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ

    సినిమా రిలీజ్

    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్?  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు  తెలుగు సినిమా
    ఈ వారం సినిమా: ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు  తెలుగు సినిమా

    సినిమా

    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే?  పవన్ కళ్యాణ్
    అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ హీరోయిన్
    Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సమాజవరగమన'; ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?  ఓటిటి
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  గుంటూరు కారం

    తెలుగు సినిమా

    మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?  సినిమా
    ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్  సినిమా
    దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ మరో సినిమా: దృశ్యం 3 ఉండనుందా?  సినిమా
    మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025