Loading...
Toxic:'టాక్సిక్' నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. యష్‌తో రొమాన్స్‌కు తారా సుతారియా రెడీ!
'టాక్సిక్' నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. యష్‌తో రొమాన్స్‌కు తారా సుతారియా రెడీ!

Toxic:'టాక్సిక్' నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. యష్‌తో రొమాన్స్‌కు తారా సుతారియా రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన 'తబాహీ' సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మూవీకి మరింత క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించేలా చిత్రబృందం మరో కీలక అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట విడుదల కానుండటంతో, ఈసారి ఎలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ కొత్త పాటకు తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ కలిసి సంగీతం సమకూర్చగా, ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ తన స్వరాన్ని అందించినట్లు తెలుస్తోంది.

వివరాలు

ఆగస్టు 8న ట్రైలర్ విడుదలయ్యే అవకాశం

ఇప్పటికే విడుదలైన 'తబాహీ' పాటలో యష్‌తో పాటు కియారా అద్వానీ కనిపించగా, రెండో పాటలో మాత్రం 'తారా సుతారియా' యష్ సరసన కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

అంతేకాకుండా ఈ పాటను రేపే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ గురించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా 2026 ఆగస్టు 8న 'టాక్సిక్' ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వివరాలు

దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్

ట్రైలర్ విడుదలైతే సినిమా కథ, యష్ పాత్ర, యాక్షన్ ఎలిమెంట్స్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాలో యష్‌తో పాటు రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సూరజిత్ గోపీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ADVERTISEMENT