Sonakshi : తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో బాలీవుడ్ భామ.. సుధీర్ బాబు సినిమాతో ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన తొలి సినిమా 'దబాంగ్'తోనే సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని, ఒక్కసారిగా బీటౌన్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
సన్నాఫ్ సర్దార్, దబాంగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ వంటి హిట్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది.
అనంతరం కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ 3 లాంటి సినిమాల్లో మెప్పించినా, ఇటీవల ఆమె ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కే పరిమితమైంది.
గత ఏడాది హీరా మండి, కకుడా సినిమాలతో తెరపై కనిపించిన ఈ బ్యూటీ, అదే ఏడాది తన పెళ్లిని గోప్యంగా జరిపిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సోనాక్షి, ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందట.
Details
మార్చి 8నుంచి షూటింగ్
సుధీర్ బాబు హీరోగా నటించనున్న 'జటాధర చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
ఈ చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్, కథ వినిపించగా సోనాక్షి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
ఇక సుధీర్ బాబు బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అతను 'వర్షం' రీమేక్ అయిన బాఘీ సినిమాలో విలన్‌గా నటించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అలాగే హీరోం హరితో హిట్ కొట్టిన సుధీర్ బాబు, తన తదుపరి చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట.
ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా జటాధరలో భాగమైతే, సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.