LOADING...
Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బ.. రాజమండ్రిలో కేసు నమోదు
ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బ.. రాజమండ్రిలో కేసు నమోదు

Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బ.. రాజమండ్రిలో కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రామ్ గోపాల్ వర్మతో పాటు ఒక టీవీ ఛానల్ యాంకర్‌పై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో చెప్పిన ప్రకారం రామ్ గోపాల్ వర్మ హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులపై సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో దూషణలు చేసినట్లు పేర్కొన్నారు. కేసు క్రైమ్ నెం487/2025 కింద, U/s 196(1), 197(1),353,354, 299 R/w (3) Bns Actప్రకారం నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,న్యాయవాది మేడా శ్రీనివాస్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.

Details

ఆర్జీవీతో పాటు యాంకర్‌పై కేసు నమోదు

ఫిర్యాదులో, ఓ మహిళా యాంకర్ వివాదాస్పద ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా రామ్ గోపాల్ వర్మ కోసం అడిగారని, అలాగే విద్వేషాలను ప్రేరేపించే వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్ట్‌ గుంపులు ఉండొచ్చని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ, సదరు యాంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీని ప్రకారం, రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఆర్జీవీతో పాటు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో, వివిధ అంశాలపై రామ్ గోపాల్ వర్మపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే.