Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'లో మరో ట్విస్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఓ గెస్ట్ రోల్ అని సమాచారం. ఈ గెస్ట్ రోల్ సినిమాకు ఏ స్థాయిలో ప్లస్ అవుతుంది? కథలో ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సర్‌ప్రైజ్ వెంకటేష్ అభిమానులను కచ్చితంగా థ్రిల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
వివరాలు
రిలీజ్ ను వాయిదా వేసిన చిత్రబృందం
సినిమాకు మరింత కమర్షియల్ ఆకర్షణ తీసుకురావాలనే ఉద్దేశంతోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గెస్ట్ రోల్‌ను సినిమాలో చేర్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ పాత్రలో ఎవరు కనిపించనున్నారు? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీ కూడా ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది.
అయితే కొన్ని కారణాలతో రిలీజ్‌ను వాయిదా వేసింది. తాజా సమాచారం ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వివరాలు
'ఆదర్శ కుటుంబం' మూవీపై భారీ అంచనాలు
ఈ చిత్రంలో వెంకటేష్‌తో పాటు నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ అంశాలను మేళవిస్తూ రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు సినిమాలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న గెస్ట్ రోల్ వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఆ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటి? సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారు? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.