Loading...
Smriti Mandhana: స్మృతి మంధానకు అరుదైన గౌరవం.. యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియామకం!
స్మృతి మంధానకు అరుదైన గౌరవం.. యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియామకం!

Smriti Mandhana: స్మృతి మంధానకు అరుదైన గౌరవం.. యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియామకం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్మృతి మంధాన (Smriti Mandhana)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమె యునిసెఫ్‌ (UNICEF) ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ఆరోగ్యం, సంక్షేమం, క్రీడల్లో మరిన్ని అవకాశాలు అందించడం వంటి అంశాలపై యునిసెఫ్‌తో కలిసి స్మృతి పనిచేయనున్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం (International Day of the Girl) సందర్భంగా ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా స్మృతి మంధాన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. యునిసెఫ్‌ ఇండియాలో సెలబ్రిటీ అడ్వకేట్‌గా చేరడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

వివరాలు

బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి

క్రికెట్‌ ఆడుతూ పెరిగిన తనకు ప్రతి కల ఒక అవకాశంతోనే ప్రారంభమవుతుందని అర్థమైందని తెలిపారు.

కఠిన శ్రమ, పట్టుదల, ప్రోత్సాహం తోడైతే ఒక అవకాశం అసాధారణ విజయానికి దారితీస్తుందని స్మృతి అన్నారు. ప్రతి ఒక్కరికీ పెద్ద కలలు కనేందుకు, తమలోని పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని అందుకునేందుకు తగిన అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు.

బాలికల హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం, క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా స్మృతి మంధాన యునిసెఫ్‌తో కలిసి పనిచేయనుండటం విశేషం.

క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరో కీలక బాధ్యతను చేపట్టారు.

ADVERTISEMENT