Loading...
Zaheer Khan EQUAL T20 League: జహీర్‌ ఖాన్‌ కొత్త ప్రయోగం.. పురుషులు, మహిళలతో కలిసి టీ20 లీగ్
జహీర్‌ ఖాన్‌ కొత్త ప్రయోగం.. పురుషులు, మహిళలతో కలిసి టీ20 లీగ్

Zaheer Khan EQUAL T20 League: జహీర్‌ ఖాన్‌ కొత్త ప్రయోగం.. పురుషులు, మహిళలతో కలిసి టీ20 లీగ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 26, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో ఇప్పటివరకు పురుషులు, మహిళలకు వేర్వేరు టోర్నీలు చూశాం. కానీ ఇప్పుడు ఆ లెక్క మారబోతోంది. భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌కు చెందిన యాంకర్‌ స్పోర్ట్స్‌ AB, జర్మన్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌తో కలిసి 'EQUAL' పేరుతో మిక్స్‌డ్‌ జెండర్‌ టీ20 లీగ్‌ను తీసుకొస్తోంది. నవంబర్‌ 25న న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ప్రొఫెషనల్‌ పురుష, మహిళా క్రికెటర్లు ఒకే పోటీలో కలిసి ఆడతారు. అంటే ఇక ప్రత్యేకంగా పురుషుల టోర్నీ, మహిళల టోర్నీ కాకుండా.. ఒకే మైదానంలో రెండు వర్గాల ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించనున్నారు.

Details

ఐదు జట్లు.. మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు

'EQUAL' తొలి సీజన్‌ 2027 ఆగస్టులో జర్మనీలో జరగనుంది. ఇందులో మొత్తం 5 జట్లు బరిలోకి దిగుతాయి. టోర్నీలో మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ప్రతి జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇక మ్యాచ్‌లో బరిలోకి దిగే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో 6 మంది మహిళలు, 5 మంది పురుషులు ఉంటారు.

టీ20 క్రికెట్‌లోని ప్రాథమిక నిబంధనలు కొనసాగుతూనే.. ఆటగాళ్ల భద్రత, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల విధానం, మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను కూడా అమలు చేయనున్నారు.

Details

క్రికెట్‌ను మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యం

ఈ కొత్త ప్రయోగంపై జహీర్‌ ఖాన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ప్రజలను ఒకచోటికి తీసుకురాగల శక్తి ఉన్న ఆట అని ఆయన పేర్కొన్నాడు.

ముఖ్యంగా యూరప్‌ వంటి అభివృద్ధి చెందుతున్న క్రికెట్‌ మార్కెట్లలో ఆటకు మరింత ఆదరణ రావాలంటే.. దాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

'EQUAL'లాంటి కార్యక్రమాలు ఆ దిశగా కీలక అడుగులని జహీర్‌ అభిప్రాయపడ్డాడు. లింగభేదం లేకుండా క్రికెట్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా ఈ క్రీడ మరింత విస్తరించగలదని పేర్కొన్నాడు.

ADVERTISEMENT

Details

ఒకే ప్లేయింగ్‌ ఎలెవన్‌.. కొత్త అనుభవం ఎలా ఉంటుందో?

'EQUAL' వెనుక ఉన్న ఆలోచన కేవలం పురుషులు, మహిళలను ఒకే జట్టులో ఆడించడమే కాదు.

ఇన్నాళ్లుగా విడివిడిగా సాగుతున్న రెండు క్రికెట్‌ విధానాలను ఒకే వేదికపైకి తీసుకురావడం.

యాంకర్‌ స్పోర్ట్స్‌ AB సహ యజమాని నాగేంద్ర సిద్దౌతం మాట్లాడుతూ.. పురుషులు, మహిళల క్రికెట్‌ తరతరాలుగా ప్రత్యేక మార్గాల్లో అభివృద్ధి చెందాయని, ఇప్పుడు ఇద్దరూ ఒకే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఈ లీగ్‌ సమాధానం చూపుతుందని అన్నారు.

కొత్త ప్రతిభకు అవకాశాలు, అభిమానులకు కొత్త అనుభవం, యూరప్‌లో క్రికెట్‌ విస్తరణకు కొత్త మార్గాలు కల్పించడమే ఈ లీగ్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT