Jagapati Babu: 'పెద్ది'లో అప్పలసూరి పాత్రపై ప్రశంసలు.. జగపతి బాబు ఏమన్నాడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో తాను పోషించిన అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని నటుడు జగపతి బాబు అన్నారు. ఈ పాత్ర నటన పరంగానూ, గెటప్ పరంగానూ తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. 'లెజెండ్' తర్వాత తాను గుర్తుపెట్టుకున్న ఆరు ముఖ్య పాత్రలలో 'పెద్ది'లోని అప్పలసూరి పాత్రకే నంబర్ వన్ స్థానం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఆ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన జగపతి బాబు..
ఈ పాత్ర గెటప్, రూపకల్పన విషయంలో పూర్తిగా క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుకే దక్కుతుందని జగపతి బాబు పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత మేకప్ ఆర్టిస్ట్ రషీద్ ప్రత్యేక శ్రద్ధతో ఈ లుక్‌ను రూపొందించారని ఆయన తెలిపారు. ఆ గెటప్ వేసుకున్న వెంటనే ఈ పాత్ర అద్భుతంగా ఉండబోతోందనే నమ్మకం కలిగిందని చెప్పారు. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
జూన్ 4న విడుదలకు సిద్ధం..
ఇటీవల విడుదలైన 'పెద్ది' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ 'పెద్ది' అనే బహుముఖ ప్రతిభ కలిగిన అథ్లెట్‌గా, అద్భుతమైన ఫిజిక్‌తో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.