LOADING...
Jagapathi Babu: 'పెద్ది'లో అప్పలసూరి అరాచకం మొదలు.. డబ్బింగ్ పూర్తి చేసిన జగపతి బాబు
'పెద్ది'లో అప్పలసూరి అరాచకం మొదలు.. డబ్బింగ్ పూర్తి చేసిన జగపతి బాబు

Jagapathi Babu: 'పెద్ది'లో అప్పలసూరి అరాచకం మొదలు.. డబ్బింగ్ పూర్తి చేసిన జగపతి బాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో కీలకమైన 'అప్పలసూరి' పాత్రను పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. జగపతి బాబు 'అప్పలసూరి' పాత్రకు డబ్బింగ్ చెబుతూ చూపించిన హావభావాలు, భావోద్వేగ డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

వివరాలు

జూన్ 4న రిలీజ్

ముఖ్యంగా ఆయన ప్రదర్శించిన ఇంటెన్సిటీ చూసి థియేటర్లలో ఈ పాత్ర భారీ ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో విడుదలైన వెంటనే మెగా అభిమానుల నుంచి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. "అప్పలసూరి పాత్ర సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాధారణంగా స్టైలిష్ విలన్ లేదా క్లాస్ తండ్రి పాత్రల్లో కనిపించే ఆయన, 'పెద్ది'లో మాత్రం పూర్తిగా భిన్నమైన మేకోవర్‌లో కనిపించారు. చెదిరిన జుట్టు, దట్టమైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

Advertisement