తదుపరి వార్తా కథనం
Gaddar Awards: మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 11, 2025
04:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల విధివిధానాలను ఖరారు చేసింది.
ఈ నెల 13 నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ అవార్డులను పలు విభాగాల్లో అందజేయనున్నారు.
ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలనచిత్రం విభాగం, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర, తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్‌లకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
అంతేకాకుండా, తెలుగు సినిమాపై రచించిన పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలకు కూడా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ పురస్కారాల్లో చోటు దక్కించుకోనున్నారు.