
Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్
ఈ వార్తాకథనం ఏంటి
నాగ్ అశ్విన్- రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగు చిత్రసీమ మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం మే 9, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూవీ మేరక్స్ భైరవ పాత్రలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి అభిమానులను ఆనందపరిచారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
దీంతో ఫస్ట్ లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను చూసిన మేకర్స్.. ప్రభాస్ పాత్ర, లుక్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇలా చేయడం ద్వారా సినిమాపై హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్
Kalki 2898 AD – As Prabhas’ look goes viral, makers planning to release more interesting stuff https://t.co/WvNdvnh0Xy #Kalki2898AD #Prabhas #NagAshwin #Bhairava #123telugu
— 123telugu (@123telugu) March 9, 2024