తదుపరి వార్తా కథనం
Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 13, 2025
11:28 am
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది.
జర్నలిస్ట్‌పై దాడి కేసు
తన నివాసమైన జల్‌పల్లిలో కొన్ని నెలల క్రితం మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదవడంతో, బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అంతేకాదు, జర్నలిస్ట్ గాయపడిన ఘటనపై మోహన్ బాబు క్షమాపణలు కూడా చెప్పారు.