NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి 
    టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం

    టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 01, 2023
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చిన్న సినిమాలుగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా అందులో ఒకటి.

    సినిమా రిలీజ్ కు ముందు కొంచెం కూడా బజ్ లేకుండా రిలీజైన ఈ సినిమా, కేవలం ప్రేక్షకుల నోటి మాట ద్వారానే 30కోట్ల వసూళ్ళు సాధించింది.

    తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, సంస్కృతిని వెండితెర మీద అచ్చంగా ఆవిష్కరించడంతో, ప్రేక్షకులు అందరూ బలగం చిత్రానికి నీరజనాలు పలికారు.

    థియేటర్లలో 50రోజులు సక్సెస్ ఫుల్ గా నడిచిన బలగం చిత్రం, ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా బలగం సినిమా టీవీ ప్రీమియర్ పై అప్డేట్ వచ్చింది.

    Details

    చర్చల్లోకి వస్తున్న టీఆర్పీ టాపిక్ 

    స్టార్ మా ఛానెల్ లో మే 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు బలగం మూవీ టెలిక్యాస్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బలగం మూవీ టీఆర్పీ గురించి చర్చ నడుస్తోంది.

    అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సినిమా వచ్చినపుడు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని పల్లెటూర్లలో చూసారు.

    ఇప్పుడు టీవీల్లోకి బలగం వచ్చేస్తుంది కాబట్టి బలగం చిత్రానికి భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

    బలగం సినిమాలో ప్రియదర్శి హీరోగా కనిపించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా కనిపించింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమను వేణు యెల్దండి డైరెక్ట్ చేసారు. రూపాలక్ష్మి, కోట జయరాం ప్రధాన పాత్రల్లో కనిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టెలివిజన్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలుగు సినిమా

    హరిహర వీరమల్లు కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ఆదిపురుష్
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  సమంత
    సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ  జూనియర్ ఎన్టీఆర్

    టెలివిజన్

    బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా ఓటిటి
    టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా తెలుగు సినిమా
    టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్ సినిమా
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025