'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బలగం'.
విమర్శల ప్రశంసందుకున్న ఈ సినిమా ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
ఇప్పుడు 'ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాంబుల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023'లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రధాన నటుడు విభాగాల్లో మరో 3 పురస్కారాలను సొంతం చేసుకుంది.
బలగం
అవార్డులపై చిత్ర యూనిట్ ఆనందం
అంతర్జాతీయ వేదికలపై బలగం మూవీకి అందుతున్న ప్రశంసలపై ఆ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రంలో వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ చిత్రాన్ని పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.