English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం
    తదుపరి వార్తా కథనం
    బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం
    బలగం సినిమాకు రెండు అవార్డులు

    బలగం: చిన్న సినిమాకు పెద్ద గౌరవం, రెండు అంతర్జాతీయ అవార్డులు కైవసం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 31, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చిన్న సినిమాగా వచ్చిన బలగం చిత్రం, బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. వేణు యెల్దండి(జబర్దస్త్ వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు.

    తెలంగాణ గ్రామీణ సంస్కృతిని వెండితెర మీద హృద్యంగా, మనసుకు హత్తుకునేలా చూపించిన బలగం చిత్రానికి ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి.

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ లో అందుబాటులో ఉన్నా కూడా థియేటర్లలో బలగం సినిమాను చూడడానికి జనాలు తరలివెళ్తున్నారు.

    అంతటి గుర్తింపును అందుకున్న బలగం చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులు వచ్చాయి. అవును, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ (LACA) వారు అవార్డులు అందజేసారు.

    ఉత్తమ చిత్రం విభాగంలో, ఉత్తమ కెమెరా విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది బలగం.

    బలగం

    సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

    ఉత్తమ చిత్రం విభాగంలో చిత్ర దర్శకుడు వేణు యెల్దండి అవార్డు అందుకోగా, ఉత్తమ కెమెరా విభాగంలో ఆచార్య వేణు అవార్డు తీసుకున్నాడు.

    ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్, ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దింతో చిత్ర పరిశ్రమ నుండి బలగం టీమ్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

    తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంత గ్రామాల్లో బలగం చిత్రాన్ని తెరకెక్కించారు. మరణం చుట్టూ నడిచే కథలో, అనేక భావోద్వేగాలు అందరి కళ్లలోంచి కన్నీళ్ళను తెప్పిస్తాయి.

    ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IMF: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ నుంచి భారీ ఊరట.. $1 బిలియన్ నిధులు విడుదల ఐఎంఎఫ్
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన టాప్ టెర్రరిస్టులు వీళ్లే.. వివరాలు ఇవే!  ఆపరేషన్‌ సిందూర్‌
    IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్ ఆపరేషన్‌ సిందూర్‌
    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్ పాకిస్థాన్

    తెలుగు సినిమా

    రంగమార్తాండ ట్రైలర్: కట్టుకున్న ఇల్లు, కన్న కూతురు మనవి కావు ట్రైలర్ టాక్
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? సినిమా
    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు చిత్ర పరిశ్రమ
    బాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా? బాలకృష్ణ

    సినిమా

    వెట్రిమారన్ థ్రిల్లర్ మూవీ విడుతలై తెలుగులో కుడా రిలీజ్? సినిమా రిలీజ్
    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు సినిమా రిలీజ్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025