
ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా చిన్నదా పెద్దదా అని డిసైడ్ చేసేది రిలీజ్ కి ముందు దాని బడ్జెట్టే. కాని రిలీజ్ తర్వాత అది పెద్దదా చిన్నదా అని డిసైడ్ చేసేది దాని కలెక్షన్లు. అవును, ఎంత ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత పెద్ద సినిమా అన్నట్టు చెప్పుకోవాలి.
ఈ లెక్కన చూసుకుంటే బలగం సినిమాది బాహుబలి రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని ప్రభంజనం రిలీజై 20రోజులవుతున్నా తగ్గట్లేదు. ఉగాది రోజు బలగం కలెక్షన్లు చూస్తే ఎవ్వరైనా ఇదే మాటంటారు.
ఇప్పటివరకు 21కోట్లకు పైగా బిజినెస్ చేసింది బలగం. మొత్తం రన్ లో 30కోట్లు చాలా సులభంగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే థియేటర్లలో దుమ్ము దులుపుతున్న ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
బలగం
సింప్లీ సౌత్ లో ఇతర దేశాల వారికే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్న బలగం
అదేంటి ఉగాది రోజు 1.51కోట్ల గ్రాస్ సాధించిన బలగం సినిమా, ఇంత సడెన్ గా ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకుంటున్నారా?
సినిమా రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి కాబట్టి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది కూడా అప్పుడే డిసైడై పోయింది. బలగం సినిమా ఈరోజు రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.
అంతేకాదు, సింప్లీ సౌత్ యాప్ లోనూ బలగం స్ట్రీమింగ్ అవుతుందట. ఇండియా తప్ప ఇతర దేశాల వాళ్ళు, ఈరోజు రాత్రి నుండి బలగం సినిమాను సింప్లీ సౌత్ లో చూడవచ్చని తెలుస్తోంది.
ఏదేమైనా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సమయంలో ఓటీటీలోకి రావడం, సినిమాకు కొంత మైనస్ అవుతుందని అంటున్నారు.