ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది.
సినిమా చూసిన వాళ్ళందరూ నాగశౌర్య బాగా చేసాడనీ, స్క్రీన్ మీద బాగా కనిపించాడనీ చెప్పుకుంటున్నారు. కాకపోతే శ్రీనివాస్ అవసరాల మార్క్ మాత్రం పెద్దగా కనిపించట్లేదని పెదవి విరుస్తున్నారు.
అదలా ఉంచితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం, ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వస్తుందో తెలిసిపోయింది.
సన్ నెక్స్ట్ ఛానల్ లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి స్ట్రీమింగ్ అవుతుందని, సినిమా స్టార్ట్ అయ్యే ముందు ప్రకటించింది.
నాగశౌర్య
నాగశౌర్యకు ఈ సారి కూడా నిరాశే
తన స్ట్రీమింగ్ పార్ట్ నర్ సన్ నెక్స్ట్ అని టైటిల్స్ లో ప్రకటించింది. ఐతే మరి సన్ నెక్స్ట్ లో ఎప్పటి నుండి అందుబాటులో ఉందనేది ఇప్పుడే ఏమీ తెలియదు.
సినిమా రిలీజైంది నిన్ననే కాబట్టి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఇప్పుడే తెలిసే అవకాశం లేదు.
గతకొన్ని రోజులుగా నాగశౌర్యకు సరైన హిట్ పడలేదు. ఈ సినిమా నుండి నాగశౌర్య మంచి నమ్మకం పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి సినిమాకు ఆశించినంత స్పందనైతే రావడం లేదు.
మరి రేపు ఆదివారం కాబట్టి సినిమా కలెక్షన్లలో ఏమైనా స్పందన కనిపించి, పెరిగే అవకాశం ఉందేమో చూడాలి
కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్స్ మీడీయా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.