మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
హీరో హీరోయిన్స్: నాగశౌర్య, మాళవిక దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ కథ: బీటెక్ లో నాయిన్ అయిన సంజయ్(నాగశౌర్య) ను సీనియర్ అనుపమ (మాళవిక), ర్యాగింగ్ నుండి కాపాడుతుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ పుడుతుంది. బీటెక్ ఐపోగానే ఎమ్మెస్ చేయడానికి ఇద్దరూ లండన్ వెళ్ళిపోతారు. అక్కడ అనుకోని కారణాల వల్ల అనుపమ కు సంజయ్ కు మధ్య దూరం పెరుగుతుంది. దానికి కారణం ఏంటి? అనుపమ వెళ్ళిన తర్వాత సంజయ్ జీవితంలోకి ఎవరు వచ్చారనేదే కథ. పర్ ఫార్మెన్స్: నాగశౌర్య చాలా బాగుంటాడు. నటన కూడా చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది. మాళవిక లుక్ బాగుంది. అందంగా కనిపించింది.
ప్రేమకథా చిత్రంలో ప్రేమ కనిపించదు
ప్లస్ పాయింట్స్: నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ ఇందులో కొత్తగా కనిపిస్తుంటుంది. శ్రీనివాస్ అవసరాల మార్క్ కామెడీ అక్కడక్కడా ఉంటుంది. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉంటాయి. మైనస్ పాయింట్స్: సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కథేమీ లేదు, కొన్నిచోట్ల కథనం చాలా వీక్ గా ఉంది. మాటలు ఆసక్తిగా అనిపించవు, హీరో హీరోయిన్స్ ఎందుకు విడిపోయారనేది సిల్లీగా ఉండడం, పాటలు బాగున్నా ఆసక్తిగా అనిపించకపోవడం. చివరగా, శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో గతంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు వెళ్ళిన వాళ్ళకు నిరాశ తప్పదనే చెప్పాలి. ప్రేమకథా చిత్రమని చెప్పినప్పటికీ ప్రేమ ఫీల్ పెద్దగా కనిపించదు.