కఫీఫీ అంటూ సరికొత్త పాటతో ముందుకొచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
ఈ వార్తాకథనం ఏంటి
నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం మార్చ్ 17వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో నుండి నాలుగవ పాటను రిలీజ్ చేసారు.
మొదటగా రిలీజైన కన్నుల చాటు మేఘమా, నీతో గడిచిన కాలమా, టైటిల్ టాక్ పాటలకు కళ్యాణి మాలిక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పుడు విడుదలైన కఫీఫీ అనే పాటకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.
కఫీఫీ అంటూ సాగే ఈ పాట, పబ్ లో పాడుకునే పాట అనీ లిరికల్ వీడియోలో చూపించేసారు. కఫీఫీ పదానికి అర్థాన్ని పాటలోనే చెప్పేసారు.
నలుగురిలో ఉన్నా, చిలిపిగా పోతుంటే.. చనువుకు నో నో చెప్పేదే కఫీఫీ అని పాట మొదట్లోనే వివరించారు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
ఫఫ మీద మెల్లగా పెరుగుతున్న ఆసక్తి
ముందు రిలీజైన మూడు పాటలు, ఇప్పుడు రిలీజైన కఫీఫీ పాట కూడా ఆకర్షణీయంగా ఉంది. పాటలతో ఈ సినిమాకు మైలేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఆ మైలేజ్ ద్వారా ప్రేక్షకులు థియేటర్ దాకా వస్తారా లేదా అన్నదే చుడాలి.
ప్రస్తుతానికి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో నెమ్మదిగా ఆసక్తి పెరుగుతోంది. శ్రీనివాస్ అవసరాల్, నాగశౌర్య కాంబినేషన్లో వచ్చిన ఇంతకుముందు సినిమాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైన విషయం ఏంటంటే, ఈ సినిమా చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉండబోతుందని తెలిసింది. థియేటర్ లో ఒకరకమైన అనుభూతికి గురి చేస్తుందని అనిపిస్తోంది.
మరేం జరుగుతుందో చూడాలి.