NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత
    తదుపరి వార్తా కథనం
    వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత
    హైదరాబాద్ లో దూసుకుపోతున్న వీరసింహారెడ్డి

    వీరసింహారెడ్డి: హైదరాబాద్ లో బాలయ్య సినిమాకు వీరలెవెల్లో బుకింగ్స్, రికార్డుల మోత

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 11, 2023
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒకరోజు తెల్లవారితే వీరసింహారెడ్డి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. బాలయ్య నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

    హైదరాబాద్ లో వీరసింహారెడ్డి దూకుడు ఎక్కువగా ఉందని బుక్ మై షో రికార్డ్స్ చెబుతున్నాయి. దాదాపుగా అన్ని థియేటర్లలోనూ టికెట్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, కొన్ని చోట్ల మొత్తం టికెట్లు అమ్ముడయ్యాయని అంటున్నారు.

    ఈ అమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే వీరసింహారెడ్డి సినిమాకు హైదరాబాద్ లో మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని, దానివల్ల నైజాం కలెక్షన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

    ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరిగా ఉందని, అటు ఓవర్సీస్ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.

    వీరసింహారెడ్డి

    వందకోట్ల క్లబ్ లో చేరే అవకాశం

    ప్రస్తుత ట్రెండ్, టికెట్ల అమ్మకాలు బాగున్నాయి. దీంతో పాటు సినిమా బాగుందని పాజిటివ్ రివ్యూస్ వస్తే వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య చైత్ర సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

    సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇదే ఊపు కొనసాగితే వందకోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు.

    అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడంతో వీరసింహారెడ్డిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుని కొత్త చరిత్రను లిఖిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.

    గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతి హాసన్ గా హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వీరసింహారెడ్డి
    టాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వీరసింహారెడ్డి

    వీరసింహారెడ్డి సెన్సార్ రిపోర్ట్: యాక్షన్ తో మేళవించిన ఎమోషన్ తెలుగు సినిమా

    టాలీవుడ్

    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు తెలుగు సినిమా
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? త్రివిక్రమ్ శ్రీనివాస్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025