LOADING...
Balan: The Boy : కేన్స్‌ చిత్రోత్సవాల్లో 'బాలన్‌ - ది బాయ్‌' ప్రదర్శన
కేన్స్‌ చిత్రోత్సవాల్లో 'బాలన్‌ - ది బాయ్‌' ప్రదర్శన

Balan: The Boy : కేన్స్‌ చిత్రోత్సవాల్లో 'బాలన్‌ - ది బాయ్‌' ప్రదర్శన

వ్రాసిన వారు Moogati Shabari
May 04, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

'మంజుమ్మల్‌ బాయ్స్‌' సినిమాతో మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందిన దర్శకుడు చిదంబరం ఇప్పుడు 'బాలన్‌ - ది బాయ్‌' అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, తెస్పియన్‌ ఫిల్మ్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇందులో చందు సలీమ్‌ కుమార్‌, టొవినో థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, ఈ నెల 14న ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శించబడనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

వివరాలు

ప్రేక్షకులకు కొత్త అనుభూతి..

ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ, ప్రపంచ సినీ రంగానికి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఒక ఇంటిలాంటిదని, అక్కడి ప్రేక్షకులు సినిమాను నిజాయితీగా స్వీకరిస్తారని తెలిపారు. అలాంటి నిజమైన సినీ అభిమానులను 'బాలన్‌ - ది బాయ్‌' తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని, మన మూలాలు ఏమిటి, మన ప్రయాణం ఎటు సాగుతోంది అనే ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.

వివరాలు

భావోద్వేగాల మధ్య సాగే కథ..

కొన్ని భావోద్వేగాలను అనుభవించినప్పటికీ వాటిని మాటల్లో చెప్పలేని వ్యక్తుల కోసం ఈ కథను తీర్చిదిద్దామని ఆయన వివరించారు. నిర్మాత వెంకట్‌ కే నారాయణ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రతి ఒక్కరిలో చర్చకు దారితీసే విధంగా ఉంటుందన్నారు. దీనిని 14న కేన్స్‌ చిత్రోత్సవంలోని బిజినెస్‌ విభాగమైన మార్ష్‌ డు ఫిల్మ్‌లో ప్రదర్శించనున్నామని తెలిపారు.

Advertisement