NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 
    తదుపరి వార్తా కథనం
    ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 
    బరెలీ కా బజార్ పాటలో నుస్రత్ బరూచా, బెల్లంకొండ శ్రీనివాస్

    ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 28, 2023
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

    ఇదివరకు ఈ సినిమా నుండి టీజర్ రిలీజైంది. టీజర్ లో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో పాటు ఒరిజినల్ ఛత్రపతిలోని సీన్లను అచ్చు గుద్దినట్టుగా దింపేసినట్లుగా అనిపించింది.

    తాజాగా ఈ చిత్రం నుండి బరేలీ కా బజార్ అనే వీడియో సాంగ్ రిలీజైంది. ఈ మాస్ సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ నుస్రత్ బరూచా కనిపించారు.

    నుస్రత్ బరూచా చాలా ఘాటుగా కనిపించింది. వైట్ డ్రెస్ లో హొయలు పోతూ మత్తెక్కించేలా డ్యాన్స్ చేసింది.

    Details

    తనీష్ బగ్చీ అందించిన సంగీతం 

    రెండు నిమిషాల నిడివి గల పాటలో బెల్లంకొండ స్టెప్పులు, నుస్రత్ హొయలు హైలైట్ గా నిలిచాయి. ఈ పాటకు సంగీతాన్ని తనిష్ బగ్చీ అందించగా, సాహిత్యాన్ని మయూర్ పూరి రచించారు. ఈ పాటను సునిధి చౌషాన్, దేవ్ నేగి పాడారు.

    ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా మారాడు.

    పెన్ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను జయంతి లాల్ గడా నిర్మిస్తున్నారు. మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషలో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    సినిమా

    నిత్యామీనన్ బర్త్ డే: జర్నలిస్ట్ కావాలనుకుని హీరోయిన్ గా మారిన నిత్యా..ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది? పవన్ కళ్యాణ్
    ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం? ఎన్టీఆర్ 30
    రామ్ చరణ్ సినిమాకు ట్యూన్లు అందించనున్న ఆస్కార్ విజేత? రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025