
ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్
ఈ వార్తాకథనం ఏంటి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే టైటిల్ తో హిందీలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రభా నటించిన తెలుగు ఛత్రపతి సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఈరోజే రిలీజైంది.
టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. టీజర్ మొత్తాన్ని ఫైట్ సీన్లతో నింపేసారు. పెద్దగా డైలాగులేమీ కనిపించలేదు. ఒరిజినల్ ఛత్రపతి సినిమాకు పెద్దగా మార్పులేమీ చేయకుండా, ఆల్ మోస్ట్ సేమ్ టు సేమ్ దింపేసినట్లుగా అనిపిస్తోంది.
యాక్షన్ సీక్వెన్సెస్ ని రిచ్ గా తీర్చిదిద్దినట్లుగా తోస్తోంది. మ్యూజిక్ కూడా చక్కగా సరిపోయింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ చిత్రాలకు ఉత్తరాదిన మంది ఫాలోయింగ్ ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఛత్రపతి టీజర్ విడుదల
Let the ACTION begin! 💥#ChatrapathiTeaser out now!
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 30, 2023
Written by #VijayendraPrasad, directed by #VVVinayak.#Chatrapathi in cinemas on 12th May, 2023. @Nushrratt @bhagyashree123 @SharadK7 @Penmovies #JayantilalGada #PenStudios #PenMarudhar #TanishkBagchi @TimesMusicHub pic.twitter.com/d5nXXBLn0T
ఛత్రపతి
టీజర్ లో కట్ లో కనిపించిన జయ జానకి నాయక పోలికలు
జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ చిత్రానికి యూట్యూబ్ లో 700మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ప్రపంచ రికార్డు.
జయ జానకి నాయక చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమాను పరిగణలోకి తీసుకుని ఛత్రపతి టీజర్ ను కట్ చేసారన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది.
ఒక్క జయ జానకి నాయక మాత్రమే కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఇతర చిత్రాలకు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి.
యూట్యూబ్ లో వచ్చిన ఫాలోయింగ్, జనాల్ని థియేటర్లు లాక్కు వస్తుందా లేదా అన్నది చూడాలి.
పెన్ మూవీస్ బ్యానర్ లో నిర్మితమైన ఛత్రపతి సినిమాను తెలుగు దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించారు. మే 12వ తేదీన రిలీజ్ అవుతుంది.