Page Loader
ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా
ఛత్రపతి రిలీజ్ డేట్

ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 27, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో లాంచ్ అయిన ఈ మూవీ నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడంతో పాటు చిత్ర టైటిల్ ని కూడా రివీల్ చేసారు. ఛత్రపతి పేరుతో రూపొందిన ఈ రీమేక్, మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ ముఖం కనిపించడం లేదు. కాకపోతే ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్, చాలా వర్కౌట్ చేసినట్లు కనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చేసింది