మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడంతా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. అప్పట్లో హిట్ అయిన సినిమాలను ప్రేక్షకుల కోసం మళ్ళీ థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. ఈ రిలీజ్ ల జాబితాలోకి యంగ్ హీరో నితిన్ కూడా చేరిపోయాడు.
నితిన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇష్క్ మూవీ, రీ రిలీజ్ కి సిద్ధమైంది. మార్చ్ 29వ తేదీన నితిన్ బర్త్ డే సందర్భంగా, అభిమానుల కోసం ప్రత్యేక షో వేయనున్నారు.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇష్క్ మూవీకి చాలామంది అభిమానులున్నారు. ఆ సినిమా నితిన్ కి కెరీర్ ని, అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నితిన్, ఇష్క్ మూవీతో హిట్ ట్రాక్ లో పడ్డాడు.
ఇష్క్
అదిరిపోయిన నితిన్, నిత్యా మీనన్ ల కెమిస్ట్రీ
ఇష్క్ సినిమాకు ముందు నితిన్ ఖాతాలో దాదాపు అరడజనుకు పైగా అపజయాలు ఉన్నాయి. ఒక దశలో నితిన్ కెరీర్ ముగిసిపోయిందని వార్తలు కూడా వచ్చాయి.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక అందమైన ప్రేమకథ. నితిన్, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ ఇష్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఇష్క్ సినిమాను నిర్మించారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. ఎడిటింగ్ బాధ్యతలు శ్రీకర్ ప్రసాద్ నెరవేర్చారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఇష్క్ చిత్రం, 2012లో రిలీజైంది. అప్పటి మ్యాజిక్ ని మరోసారి అనుభవించాలంటే మార్చ్ 29వరకు వెయిట్ చేయండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
థియేటర్లలోకి మళ్ళీ వస్తున్న ఇష్క్
Witness the Breezy Tale of Love Destiny once again 🤩@actor_nithiin's Cult Blockbuster #Ishq Re-Releasing on March 29th on occasion of his birthday 🥳💥
— Ramesh Bala (@rameshlaus) March 25, 2023
Stay tuned for more details.@MenenNithya @Vikram_K_Kumar @anuprubens #AravindhSankar @pcsreeram @SreshthMovies… pic.twitter.com/yIaKs8Gwdi