LOADING...
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి హీరో
బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి హీరో

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి హీరో

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్,కెరీర్ ప్రారంభం నుంచే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. మధ్య మధ్యలో భిన్నమైన కథలను కూడా ఎంచుకుంటూ తన నటనలో వైవిధ్యం చూపించాడు. ఇటీవల విడుదలైన కిష్కింధపురి సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన,ఆ తర్వాత వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు మరో అరుదైన ఘనతతో వార్తల్లో నిలిచాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు ఉత్తర భారతదేశంలో విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా ఆయన చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు యూట్యూబ్‌లో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుంటాయి.

వివరాలు 

జయ జానకి నాయక సినిమా హిందీ వెర్షన్'కి 100 కోట్ల వ్యూస్

ఈ నేపథ్యంలో ఆయన నటించిన జయ జానకి నాయక సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ దాటిన తొలి భారతీయ చిత్రంగా కొత్త రికార్డ్ నెలకొల్పింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధారణ స్థాయి విజయాన్నే అందుకున్నప్పటికీ, హిందీలో డబ్ చేసిన వెర్షన్‌కు అనూహ్య స్పందన లభించింది. పెన్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైన ఈ చిత్రం ఏడేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తాజాగా 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని చేరుకుంది.

వివరాలు 

బెల్లంకొండ శ్రీనివాస్‌కు మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు

ఇదే కాదు, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం హిందీ డబ్బింగ్ వెర్షన్ దాదాపు 800 మిలియన్ వ్యూస్, సీత చిత్రం సుమారు 700 మిలియన్ వ్యూస్ సాధించాయి. ఆయన నటించిన మరికొన్ని చిత్రాలు కూడా హిందీ యూట్యూబ్ ఛానళ్లలో వందల మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేశాయి. దీంతో ముఖ్యంగా ఉత్తర భారత గ్రామీణ ప్రాంత ప్రేక్షకుల్లో బెల్లంకొండ శ్రీనివాస్‌కు మాస్ హీరోగా ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. యూట్యూబ్‌లో లభించిన ఈ ఆదరణతో హిందీ మార్కెట్‌లోనూ తనకు మంచి అవకాశాలు వస్తాయని భావించిన బెల్లంకొండ శ్రీనివాస్, ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Advertisement

వివరాలు 

శ్రీనివాస్‌ హిందీ డబ్బింగ్, యూట్యూబ్ హక్కులకు మరింత డిమాండ్

అయితే ఇప్పుడు జయ జానకి నాయక సాధించిన 1 బిలియన్ వ్యూస్ రికార్డ్‌తో పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘనతతో బెల్లంకొండ శ్రీనివాస్‌కు సంబంధించిన హిందీ డబ్బింగ్, యూట్యూబ్ హక్కులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మరోసారి నేరుగా హిందీ సినిమా చేసే దిశగా అడుగులు వేస్తారా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది.

Advertisement