
భగవంత్ కేసరి ప్రమోషన్స్ షురూ: పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ కెరీర్లో 108వ సినిమాగా రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు.
బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ క్రమంలో ఒకానొక ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేసి ప్రమోషన్ పనులను స్టార్ట్ చేశారు.
అనిల్ రావిపూడి షేర్ చేసిన ఈ వీడియోలో, భగవంత్ కేసరి షూటింగ్ సమయంలోని సన్నివేశాలను చూపించారు.
భగవంత్ కేసరి సినిమా షూటింగుకు మొత్తం 8నెలల సమయం తీసుకుందని, నందమూరి బాలకృష్ణ ఎల్లప్పుడూ ఎంతో సపోర్ట్ గా నిలిచారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
Details
పవర్ ఫుల్ డైలాగ్ తో పవర్ ఫుల్ వీడియో
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ వీడియో చివర్లో, పవర్ ఫుల్ డైలాగ్ తో విలన్లను బాలయ్య బెదిరించే సీన్ కనిపిస్తుంది. ఆ డైలాగ్ కి అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.
భగవంత్ కేసరి సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్, ఇంకా ఒక పాట మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పుడు సెట్స్ లోని వీడియో రిలీజ్ కావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనిల్ రావిపూడి ట్వీట్
Started the memorable shoot journey of #BhagavanthKesari on December 8th,2022 and wrapped it after an intense & joyful 8 Months of shoot 🤗
— Anil Ravipudi (@AnilRavipudi) September 28, 2023
Grateful to the legend himself #NandamuriBalakrishna garu and my entire team for the humongous support on the sets always 🙏🏻
I’m sure this… pic.twitter.com/wGF6iKPRWc