Loading...
Sardar 2: యాక్షన్ సీన్లతో అదరగొట్టిన సూర్య.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్!
భైరవుడి పాట వచ్చేసింది.. మాస్ బీట్‌తో అదరగొట్టిన కొత్త సాంగ్!

Sardar 2: యాక్షన్ సీన్లతో అదరగొట్టిన సూర్య.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తి హీరోగా, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సర్దార్‌' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో రూపొందిన సీక్వెల్‌ 'సర్దార్‌ 2' విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేయగా, యాక్షన్‌, థ్రిల్‌, స్టైలిష్‌ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌, ఇషాన్‌ సక్సేనా నిర్మించిన ఈ సినిమాలో కార్తి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

వివరాలు

టీజర్‌లో హైలైట్స్

శాంతం... శాంతం... శాంతమే ప్రశాంతం అంటూ ఎస్‌జే సూర్య చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ గూఢచారులు... ఒకడు తండ్రి, ఒకడు కొడుకు అంటూ కార్తి పోషిస్తున్న రెండు పాత్రలను రా (RAW) ఏజెంట్లుగా పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

టీజర్‌లో కార్తి చేసిన హై-ఆక్టేన్‌ యాక్షన్‌ సన్నివేశాలు, స్టైలిష్‌ విజువల్స్‌, గూఢచారి నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

మరోవైపు ఎస్‌జే సూర్య తన ప్రత్యేక విలనిజంతో ఆకట్టుకునేలా కనిపించారు.

చివర్లో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే... గెలవబోయేది మంచి విలనా... చెడ్డ హీరోలా? అంటూ ఎస్‌జే సూర్య చెప్పిన డైలాగ్‌ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది.

ADVERTISEMENT