LOADING...
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ షాక్.. 'కింగ్‌డమ్' సీక్వెల్‌పై సస్పెన్స్!
విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ షాక్.. 'కింగ్‌డమ్' సీక్వెల్‌పై సస్పెన్స్!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ షాక్.. 'కింగ్‌డమ్' సీక్వెల్‌పై సస్పెన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్యాన్ ఇండియా స్థాయిలో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అయితే 2025 సంవత్సరం అతని కెరీర్‌కి అంత అదృష్టంగా రావలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో వచ్చిన 'కింగ్‌డమ్' సినిమా అనేక అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ, ప్రేక్షకుల ప్రతిస్పందన ఆశించిన స్థాయికి చేరలేదనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ రూమర్స్ విజయ్ అభిమానులను షాక్‌కు గురి చేశాయి. దర్శక, నిర్మాత వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండగా 'కింగ్‌డమ్' రెండవ భాగం నిర్మాణం నిలిపివేయచ్చని సమాచారం బయటకు వచ్చింది.

Details

అధికారిక ప్రకటన వెలువడలేదు

సినిమా నిర్మాతలు ప్రారంభంలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ మొదటి భాగానికి వచ్చిన స్పందనను చూసి, రెండవ భాగం నిర్మాణంపై నిశ్చయ నిర్ణయం తీసుకోలేకపోవచ్చని రూమర్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‌కు భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ, వసూళ్ల పరంగా అది నష్టాలను మాత్రమే మిగిల్చిందని అంటున్నారు. ఈ నేపథ్యమే సెకండ్ పార్ట్‌పై స్పష్టత లేకుండా నిలిచిపోగా, ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'కింగ్‌డమ్'లో విజయ్ దేవరకొండ - భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. ఈ చిత్రానికి సుమారుగా రూ.130 కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ, వసూలు చేయగలిగిన మొత్తం రూ.82 కోట్లు మాత్రమే అని టాక్. ఈ కారణంగానే సీక్వెల్‌పై అనాసక్తి నెలకొంది.

Advertisement