Pallavi Prashanth: బిగ్ బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) సహా అతని సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్లూరులో అతని నివాసం వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
దాదాపు పల్లవి ప్రశాంత్‌ని జూబ్లీహిల్స్‌లో ఆరు గంటల పాటు విచారించి, చంచల్ గూడ జైలుకు తరలించారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తే ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని జడ్జి ఇంట్లో హాజరుపర్చగా, న్యాయమూర్తి ప్రశాంత్‌కి 14 రోజుల రిమాండ్ విధించారు.
Details
తొమ్మిది సెక్షన్ల కింద ప్రశాంత్ పై కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై ప్రశాంత్, మరికొంతమందిపై తొమ్మది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
అతని కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్టు చేశామన్నారు.
ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులను విచారిస్తున్నారు.