Prabhas vs Shahrukh : మరోసారి బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ వర్సెస్ షారూఖ్ మళ్లీ ఫైట్?
ఈ వార్తాకథనం ఏంటి
మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్- షారుక్ ఖాన్ మధ్య పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్న షారూఖ్ ఖాన్‌కు, సలార్ రూపంలో ప్రభాస్ గట్టి పోటీ ఇచ్చాడు. ఈ పోరులో బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్ హీరోతో పోటీలో నిలవలేక షారూఖ్ ఆశించిన హ్యాట్రిక్‌కు బ్రేక్ పడింది. ఢంకీపై ఉన్న అంచనాలను కూడా 'సలార్' ప్రభావం తగ్గించినట్లు ట్రేడ్ వర్గాలు భావించాయి. 'సలార్' షాక్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు కింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఈ చిత్రంతో తన కుమార్తె సుహానా ఖాన్‌ను వెండితెరకు పరిచయం చేయనున్నారు.
వివరాలు
రిలీజ్ డేట్స్ విషయంలో వెనుకంజ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక షారూఖ్ రాకతో సాధారణంగా ఇతర హీరోలు రిలీజ్ డేట్స్ విషయంలో వెనుకంజ వేస్తారు. అయితే ఈసారి ప్రభాస్ మాత్రం ముందుగానే బరిలోకి దిగే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'రాజా సాబ్' తర్వాత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ చిత్రం మొదట ఆగస్టు, తర్వాత దసరా రిలీజ్ అంటూ వార్తలు వచ్చినా అవి సాధ్యంకాలేదని తెలుస్తోంది.
వివరాలు
డిసెంబర్ 4న విడుదల చేసేలా ప్లాన్
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయిందని, ప్రభాస్ విదేశీ పర్యటనల కారణంగా ఆలస్యం జరిగిందని సమాచారం. తాజా టాక్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ఫౌజీ', 'కింగ్' మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, బాలీవుడ్ మార్కెట్‌లో 'స్లో పాయిజన్'లా ప్రభావం చూపితే షారూఖ్ ఖాన్ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.