
Sushant : సుశాంత్ కేసులో సీబీఐ క్లారిటీ.. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత కేసు ముగింపు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మిస్టరీ మరణంపై సీబీఐ తుది నివేదిక సమర్పించింది.
దాదాపు నాలుగేళ్లపాటు దర్యాప్తు చేసిన తర్వాత, ఇది హత్యకాదు, ఆత్మహత్యే అని స్పష్టం చేసింది.
సుశాంత్ మరణానికి ఎవరైనా ప్రేరేపించారన్న ఆధారాలు లభ్యం కాలేదని నివేదికలో పేర్కొంది.
Details
కేసు మూసివేతకు సిఫార్సు
2020 జూన్ 14న సుశాంత్ ముంబయిలోని బాంద్రా ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించాడు.
మొదట్లో హత్య అనుమానాలు వ్యక్తమైనా, సీబీఐ దర్యాప్తులో ఇది ఆత్మహత్యగా నిర్ధారణైంది.
సుశాంత్ మరణానికి సంబంధించి నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులకు క్లీన్ చిట్ లభించింది.
ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసిన సీబీఐ, కేసు మూసివేయాలని ముంబయి స్పెషల్ కోర్టుకు నివేదికను సమర్పించింది.
ఈ నివేదికను స్పెషల్ కోర్టు ఆమోదిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Details
మేనేజర్ సూసైడ్ మిస్టరీ
సుశాంత్ మరణానికి వారం రోజుల ముందు అతని మేనేజర్ బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం మరో మిస్టరీగా మిగిలిపోయింది.
కెరీర్ పరంగా వేగంగా ఎదుగుతున్న సుశాంత్ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా అగ్రస్థాయికి చేరుకోవాల్సిన వేళ, అతని ప్రస్థానం అర్ధాంతరంగా ముగియడం అభిమానులను కలచివేసింది.